భక్తుల సౌకర్యార్థం రూ.3 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

పిచ్చాటూరు జూలై 12 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం రామగిరిలోని శ్రీ వాలీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం రూ.3 లక్షల వ్యయంతో కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులను ప్రారంభించారు. తిరువళ్లూరుకు చెందిన దాత కేబీఎం ఎయిలరసన్ తన సొంత నిధులతో ఈ పనులను చేపట్టగా, ఇవే రోజున పూర్తి చేయనున్నట్లు ఆలయ చైర్మన్ కేఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.13 లక్షలు మంజూరు చేసిందని, త్వరలోనే ఆ...