GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 6:35 am Digital Edition : GURU SWAMY

భారతదేశ ఐక్యతకు పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్

* బిసీఎం విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీసీ నాగరాజ్.
* కె ఈ సి లో ఘనంగా జాతీయ ఏకతా దివాస్ వేడుకలు.
చిత్తూరు బ్యూరో,కుప్పం అక్టోబర్ 1(గరుడ ధాత్రి న్యూస్):
కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యములో శనివారం భారతదేశ ఉక్కు మనిషి, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఏకతా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డా. బి.సి. నాగరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని సంస్థానాలను ఏకీకృతం చేసి భారతదేశ ఐక్యతకు పటిష్టమైన పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ సమైక్యత, సమగ్రత మరియు అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ మాధవస్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంగాధరస్, కోఆర్డినేటర్ డా. అరుణ్ కుమార్, ఫీజికల్ డైరెక్టర్ సతీష్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, పి ఆర్ ఓ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.