GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:05 pm Digital Edition : GURU SWAMY

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):ఆసియా క్రీడల్లో 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయంతో భారత్ నేరుగా లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించడం దేశానికే గర్వకారణమని కొనియాడారు. మ్యాచ్ విన్నింగ్ గోల్తో కీలక పాత్ర పోషించిన లాల్రెమ్సియామి, కెప్టెన్ సలీమా టెటే, దీపికతో పాటు జట్టులోని ప్రతి ఒక్కరినీ ప్రశంసించిన ఆయన, భారత మహిళా ఛాంపియన్ల ప్రతిభను చూసి దేశమంతా గర్విస్తోందని పేర్కొన్నారు.