GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 7:04 am Posted by : GURU SWAMY

భారీ ఎత్తున పునపరివారి పాళెం గ్రామంలో ప్రజా వేదిక సభ

-పున్నపరివారిపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సియం చంద్రబాబు

-ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన సియం

-పున్నపరివారిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లిన సీఎం చంద్రబాబు

– పద్మమ్మకు వితంతు పింఛను రూ.4 వేలు, దివ్యాంగురాలు తులశమ్మకు రూ.15,000 అందించిన సియం

-అనంతరం వారి కుటుంబ సభ్యులతో సమావేశమై ఇబ్బందులను అడిగి తెలుసుకొన్న సియం

-కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి :సియం చంద్రబాబు

-సంస్కృతి కార్యక్రమాలతో ఆకట్టుకొన్న విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు అందించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోకి రాబోయే అన్ని రకాల ఏసీ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగాప్రయాణించవచ్చని ఆయన సంచలన ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం, చిల్లకూరు మండలంలోని పున్నపరివారిపాలెం గ్రామంలోజరిగిన ప్రజా వేదిక బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

*కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, మహిళల సాధికారతకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం’ పథకంపై కూడా సీఎం చంద్రబాబు కీలక అప్‌డేట్ ఇచ్చారు.

ఈ పథకం కింద అర్హులైన తల్లులకు అందించే ఆర్థిక సహాయం పంపిణీ తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా నిర్ణయించి, ప్రకటిస్తుందని సభ ముఖంగా హామీ ఇచ్చారు. ఈ లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

-వైసీపీ సోషల్ మీడియా వేధింపులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

*విజయవాడ కేంద్రంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కుల రాజకీయాలకు తెరలేపుతోందని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక, ఆయనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆయన కూతుళ్లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని మండిపడ్డారు.

ఇలాంటి నీచ రాజకీయాలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి రాజధాని ఎంత అవసరమో సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ, భవిష్యత్ తరాలకు ఒక శాశ్వత రాజధాని అవసరం. కానీ, ఆ గొడ్డలి పార్టీకి మాత్రం రాజధానితో పనిలేదు అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

-పున్నపువారిపాలెం గ్రామంలోపర్యటించిన సియం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుధవారం నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లిన సీఎం చంద్రబాబు పద్మమ్మకు వితంతు పింఛను రూ.4 వేలు, దివ్యాంగురాలు తులశమ్మకు రూ.15,000 అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో సమావేశమై ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

-సంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకొన్న చిన్నారులు

పున్నపువారిపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలోముఖ్య మంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలకు చెందిన చిన్నారులు యోగాలు, విచిత్ర వేషధారణలు, కరేటి, పలు సంస్కృతిక కార్యక్రమాలు చేసి ఆకట్టుకున్నారు. సియం చంద్రబాబు చిన్నారులకు అభినందనలు తెలిపారు.*