భారీ వర్షాల హెచ్చరిక.. పిచ్చాటూరులో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి.. అధికారులకు తహశీల్దార్ ఆదేశాలు పిచ్చాటూరు, అక్టోబర్ 28 గరుడాద్రి న్యూస్ : తిరుపతి జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో పిచ్చాటూరు తహశీల్దార్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ వై. చంద్రబాబు నాయుడు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా...