GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 10:18 am Digital Edition : GURU SWAMY

భూపత్తేశ్వర కోన అడవిలో మహిళ అదృశ్యం – గాలింపు చర్యలు ముమ్మరం

*భూపత్తేశ్వర కోన అడవిలో మహిళ అదృశ్యం – గాలింపు చర్యలు ముమ్మరం*

నాగలాపురం మండలంలోని బీరకుప్పం హరిజనవాడకు చెందిన చిన్నముట్ట ద్రాక్షాయని (53) అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఆమె భూపతేశ్వర కోన అడవి ప్రాంతంలో తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పనులకు వెళ్లిన ద్రాక్షాయని తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్సై సునీల్ గురువారం తమ సిబ్బందితో కలిసి భూపతేశ్వర కోన అడవి ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ మహిళకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే నాగలాపురం పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని ప్రజలను ఎస్సై కోరారు.

స్థానిక ప్రజలు కూడా సహకరించి సమాచారం అందిస్తే గాలింపు చర్యలు వేగవంతం అవుతాయని ఆయన అన్నారు.