బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్17
బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తం అటవీ సమీపంలో తమిళనాడు సరిహద్దుకు దగ్గర వ్యవసాయ పొలాలువద్ద కడపనత్తం కు చెందిన గజేంద్ర రైతు ఒక ఏకరా లో భోప్పాయి తోట సాగు చేస్తున్నాడు.ఇక మార్కెట్ కు భోప్పాయి పంట మార్కెట్ కు తరలించాలి .ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఓటరు ఏనుగు ఈ తోట పై దాడి చేసి భోప్పాయి తోటను ఎక్కువ భాగం విరచి,కొంత మేరకు కాయలు ఆరగించి వెళ్లి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.ఈ సందర్భంగా రైతు గజేంద్ర మాట్లాడుతు చేతికి వచ్చిన పంట ను ఒంటరి ఏనుగు తమకు దక్కనియక పోవడం ఆవేదనకు గురిచేసిందని,ప్రస్తుతం భోప్పాయి కాయలకు మంచి ధర అభిస్తుందని కానీ ఒంటరి ఏనుగు తమకు తీవ్ర. నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ ఒంటరి ఏనుగు 10 రోజులు గాఈ ప్రాంతంలోని తిరుగుతూ రైతుల పంటల పై దాడి చేస్తున్న అటవీశాఖ ఈ ఏనుగు ను మరో ప్రాంతంకు తరలించడాని ఎలాంటి చర్యలు తీసుకోక రైతుల జీవిథాలతో చెలగాటం అడుతుందని రైతులువిమర్శిస్తున్నారు. పంట నష్ట పరిహారం మొక్కుబడిగా ప్రభుత్వంచెల్లించి చేతులు దులుపుకొంటున్నారు అని రైతులు వాపోతున్నారు. ఇకనైనా బైరెడ్డిపల్లి మండల రైతుల పంటలు ,రైతుల ప్రాణాలును ఏనుగుల నుండి రక్షణ కల్పించడానికి శాశ్వత సమస్య పరిష్కార చర్యలు తీసుకోవాలనిప్రభుత్వం ను కోరుతున్నారు.