GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 5:47 am Posted by : GURU SWAMY

మంచి ప్రజా పాలనకు కట్టుబడి పని చేయాలి…

మంచి ప్రజా పాలనకు కట్టుబడి పని చేయాలి…
తిరుపతి నియోజకవర్గం పరిస్థితులను నారా లోకేష్ కు వివరించిన డాక్టర్ ‘ కోడూరు ‘
గరుడధాత్రి న్యూస్ :

తిరుపతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించి మంచి ప్రజా పాలన కు కట్టుబడి పని చేయాలని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం కు సూచించారు. మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ను టిడిపి మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మర్యాదపూర్వకంగా కలిసి తిరుపతి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా మంత్రి లోకేష్ కు వివరించారు. తిరుపతి నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, నిధులు, ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా నారా లోకేష్ కు వివరించారు. తిరుపతి నియోజకవర్గంలో రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో ఆయోమయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత చురుకుదనం లోతైన అవగాహనతో ముందుకు సాగాలని డాక్టర్ బాలసుబ్రమణ్యం కు నారా లోకేష్ సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి వేగవంతమైన పరిష్కారాల ద్వారా మంచి పాలన అందించాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడి పై ఉందని మంత్రి లోకేష్ సూచించారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం కోసం బూత్ లెవెల్ లో నిరంతరంగా పనిచేయాలని మంత్రి లోకేష్ చెప్పినట్లు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మీడియాకు తెలిపారు. ఇవాళ తరబడి పరిష్కారం కానీ శెట్టిపల్లి వాసుల భూ సమస్య పరిష్కారంతోపాటు తిరుపతి నియోజకవర్గం పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యలు అభివృద్ధి పట్ల చెబుతున్న దృష్టికి నారా లోకేష్ కు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండో తరం రాజకీయ నాయకునిగా పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత అచంచలమని ప్రజాసేవ తన లక్ష్యమని స్పష్టం చేశారని డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు.