GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 8:17 pm Digital Edition : GURU SWAMY

మండలంలో 94 శాతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

కార్వేటినగరం అక్టోబర్ 1 గరుడ ధాత్రి న్యూస్ కార్వేటినగరం మండలంలో 94 శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో రాధికా సింగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కార్వేటినగరం మేజర్ పంచాయతీ పెద్ద హరిజనవాడ, సిడి కండిగ పంచాయతీలో కోదండరామపురం, టికేయంపేట, సిడి కండిగ, ఎం ఎం మిలాసం, ఆలత్తూరు గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను తనిఖీ నిర్వహించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాల్గొని ప్రతి ఇంటికి వద్దకు ఫంక్షన్లు పంపిణీ జరగాయ అని అడిగి తెలుసుకున్నారు.నిరుపయోగమైన ప్లాస్టిక్ ఇనుము వంటి ఐదు కిలో కన్నా ఎక్కువ బరువుతో వస్తువులకు స్వచ్ఛ రథం టోకెన్లను అందించారు.
ఈ టోకెన్ల ద్వారా కుక్కర్ స్టీల్ క్యారియర్ బహుమతి గా పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్, సచివాలయ డిప్యూటీ ఎంపీటీవో సౌజన్య, పంచాయతీ ప్రత్యేక అధికారులు సచివాల సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు