చౌడేపల్లి ఆగస్టు 03 గరుడ దాత్రి న్యూస్
మండల సర్వతో ముఖాభివృద్ధికి అందరం కృషి చేద్దామని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాదిరాజు లక్ష్మణ రాజు( పతి రాజు) కోరారు సోమవారము మండల కేంద్రమైన చౌడేపల్లిలోని పరిపాలన భవనంలో అధికారులతో ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత దాహార్తిని తీర్చేందుకు ప్రాధాన్యతt ఇవ్వాలన్నారు కార్యాలయాలకు సమస్యలు పరిష్కరించాలని వచ్చే ప్రజలకు స్నేహభావంతో మెలగి వారి సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా రెవెన్యూసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అదేవిధంగా సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పగడాల హరి రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కృష్ణారెడ్డి కార్తీక్ కార్తీక్ వెంకటరెడ్డి డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు