మండల అభివృద్ధికి కృషి చేద్దాం : మాదిరాజు

చౌడేపల్లి ఆగస్టు 03 గరుడ దాత్రి న్యూస్ మండల సర్వతో ముఖాభివృద్ధికి అందరం కృషి చేద్దామని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాదిరాజు లక్ష్మణ రాజు( పతి రాజు) కోరారు సోమవారము మండల కేంద్రమైన చౌడేపల్లిలోని పరిపాలన భవనంలో అధికారులతో ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత దాహార్తిని తీర్చేందుకు ప్రాధాన్యతt ఇవ్వాలన్నారు కార్యాలయాలకు సమస్యలు పరిష్కరించాలని వచ్చే ప్రజలకు స్నేహభావంతో మెలగి వారి సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా రెవెన్యూసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు...