మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎన్టీఆర్ వెంకయ్య
సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలం చెన్నవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మూగాల వెంకయ్య (ఎన్టీఆర్ వెంకయ్య) , శ్రీసిటీ పారిశ్రామిక వాడలో క్యారియర్ ఏసి పరిశ్రమ శంఖుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ను కలిసి గ్రామ మరియు మండల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వెంకయ్య తన రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ పట్ల నిబద్ధతను వివరించారు. 2019-2024 మధ్య పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి, తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడ్డానని తెలిపారు. -వ్యక్తిగత ఆస్తులు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 7 ఓట్ల తేడాతో ఓడిపోయానని, అయినప్పటికీ ప్రజాసేవపై తన కట్టుబాటు కొనసాగుతోందని చెప్పారు.
వినతిపత్రంలో చెన్నవారిపాలెం గ్రామానికి సంబంధించిన కీలక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా
“స్మశానానికి వెళ్లే రహదారి నిర్మాణం”
“మురికికాలువల ఏర్పాటు”
*”శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం”
అలాగే
వరదయ్యపాలెం మండలానికి అత్యవసరంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ విషయమై ఇప్పటికే ఉన్నతాధికారుల పరిశీలన జరిగినట్లు, ప్రాంతంలో యువత అధికంగా ఉండటం మరియు సమీపంలో శ్రీసిటీ వంటి పారిశ్రామిక వాడ ఉండటం వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, గ్రామం మరియు మండలానికి సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు వెంకయ్య తెలిపారు.