GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 6:14 pm Posted by : GURU SWAMY

మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో రేపటి నుంచి ఏపీఎల్-2026 క్రికెట్ సందడి

-మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో రేపటి నుంచి 30 వరకు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు
-ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హీరో రామ్ చరణ్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి నారా లోకేష్
మంగళగిరి, జూన్ 23 గరుడధాత్రి న్యూస్ :
మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జీఎంఆర్ ఏపీఎల్-2026 క్రికెట్ టోర్నమెంట్ రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో రాష్ట్రంలోని వివిధ జట్లు పాల్గొని అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను అందించనున్నాయి.
టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం.
మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో తొలిసారిగా జరుగుతున్న ఈ ఏపీఎల్-2026 టోర్నమెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటగాళ్లు, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
జూన్ 30న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.