మచిలీపట్నంకుబయలుదేరిన కాణిపాకం ప్రసార రథం

కాణిపాకం సెప్టెంబర్ 18 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగాకాణిపాకం దేవస్థానం నుంచి ప్రసార రథం మచిలీపట్నానికి శుక్రవారం బయలుదేరింది. దేవస్థానంఏఈఓరవీంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రసార రథం ఇన్‌చార్జిగా హరి స్వామి బాధ్యతలు స్వీకరించారు. అర్చకులు హనుమంతు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథాన్ని మచిలీపట్నానికి పంపించారు.స్వామివారి విశిష్టత, దేవస్థానంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రసార రథం ద్వారా ప్రచారంనిర్వహించనున్నారు.