GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 6:13 pm Posted by : GARUDA DHATRI NEWS

మట్టి తరలింపుకు సై -మరమ్మతులకు నై నై..!!

సత్యవేడు నుంచి తమిళనాడుకు భారీగా మట్టి తరలింపు జోరుగా సాగుతోంది ఈ వ్యవహారంలో ఎవరైనా తలదూరిస్తే…. కేసులు పెడతాం… మీ అంతు చూస్తామని బెదిరింపులు చేస్తున్నారు ఈ భారీ మట్టి దోపిడీ కారణంగా అనేక గ్రామాల రోడ్లతోపాటు సత్యవేడు ప్రధాన రహదారులు దుస్థితికి చేరుకుంది చినుకు పడితే ఈ రోడ్ల మీద ఏర్పడ్డ చిన్న చిన్న గోతుల్లో వర్షపు నీరు నిల్వ చేరి ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి గాంధీ విగ్రహం ముందు ప్రాంతం, శ్రీకాళహస్తి బస్టాండ్ లోని నాయుడు మెస్ సమీప వద్ద సిమెంట్ రోడ్ల మీదే పెద్దపెద్ద గోతులు వాహన చోదకులను, స్థానికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి ఈ గోతుల్లో వర్షపు నీరు ఉన్న విషయం తెలియక… అందులో వాహనాలు దించి నానా అవసర పడుతున్నారు దీనికి తోడు సత్యవేడు – చెన్నై రోడ్డులోని తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో రోడ్డు పూర్తిగా గుంతల మయంగా తయారైంది తమిళనాడు నుంచి సత్య వేడుకు వాహనాల వస్తే… సరిహద్దు ప్రాంతం వద్ద నానా అవస్థలు పడాల్సిందే… వాహనాల ఊపుడు… దమ దమ ధమా అనే శబ్దాలు.. ఎప్పుడు వాహనాలు ఆగిపోతాయో తెలియని పరిస్థితి. గత ఏడాది పైగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.. ఉగాది లోపు రోడ్లన్నీ బాగు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ… ఆ దిశగా గుంతల మీద కనీసం అతుకులు కూడా వేసిన పాపాన పోలేదు సంబంధిత రోడ్లు భవనాల శాఖ ఏ ఈ కుర్చీ.. ఇన్చార్జి తో సాగుతోంది పాలకులు, ప్రజాప్రతినిధుల విషయానికొస్తే… ఆధిపత్య పోరు…. మా మనుషులకే పదవులు… మా వారికే అన్ని అనే విధంగా ముందుకు పోతున్నారే తప్ప…. రహదారుల మరమ్మత్తుల విషయాలపై శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు ఇక సత్యవేడు – ఊతుకోట రోడ్డు బలోపేతం కు నిధులు మంజూరు అయింది… కాంట్రాక్టర్ నాలుగు కిలోమీటర్ల వరకు పనులు చేసి… పత్తా లేకుండా పోయారు ఆ విషయాలపై కూడా చొరవ తీసుకునే దిక్కే లేదు ఈ కారణంగా ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.