GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 9:44 pm Digital Edition : GURU SWAMY

మట్టి వినాయకుల తయారీతో పర్యావరణ పరిరక్షణకు పిలుపు

కార్వేటినగరం సెప్టెంబర్ 12 గరుడదాద్రి న్యూస్
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ, వారి సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లెలో ఎకో క్లబ్ కార్యక్రమాలలో భాగంగా వినాయక చవితి సందర్భంగా బంకమట్టితో వినాయక ప్రతిమల తయారీ పోటీని సోమవారం నిర్వహించారు.పాఠశాల విద్యార్థులను తరగతులతో సంబంధం లేకుండా ప్రాథమిక, ఉన్నత తరగతుల వారీగా నాలుగు లేదా ఐదుగురు చొప్పున మొత్తం 56 సమూహాలుగా విభజించి, వారికి బంకమట్టిని అందించారు. విద్యార్థులు కేవలం ఒక గంట వ్యవధిలో ఎంతో ఉత్సాహంగా వివిధ ఆకృతుల్లో వినాయక ప్రతిమలను తయారు చేశారు. వాటిని వాటర్ కలర్స్‌తో పాటు పసుపు, కుంకుమ, ఆకుపసరు, సున్నం, బొగ్గు వంటి సహజ పదార్థాలతో అందంగా అలంకరించారు.ఈ సందర్భంగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు బాబు మరియు ఇతర ఉపాధ్యాయులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రసాయన రంగులతో తయారు చేసిన వినాయక ప్రతిమల వల్ల జలవనరులు కలుషితం కావడంతో పాటు జలచర జీవులకు, పర్యావరణానికి కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. పర్యావరణహితంగా వినాయక చవితిని నిర్వహించేందుకు బంకమట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను వినియోగించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అనంతరం ఉపాధ్యాయ బృందం ప్రతిమలను పరిశీలించి, సృజనాత్మకత, నైపుణ్యం, ఆకృతి, అలంకరణ, సహజ రంగుల వినియోగం తదితర అంశాల ఆధారంగా ప్రాథమిక, ఉన్నత తరగతుల విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎంపిక చేశారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్. ఉమాపతి పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించగా, ప్రధానోపాధ్యాయులు చెంగల్ రాజు విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.
కార్యక్రమాన్ని జీవశాస్త్ర ఉపాధ్యాయులు బాబు ఆధ్వర్యంలో ఇతర ఉపాధ్యాయుల స