మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి

పిచ్చాటూరులో "డ్రగ్స్ వద్దు బ్రో" అవగాహన కార్యక్రమం పిచ్చాటూరు, జూన్ 17 గరుడధాత్రి : మాదకద్రవ్యాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో బుధవారం "డ్రగ్స్ వద్దు బ్రో" అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవస్థ, సమాజంపై...