మత్స్యకారుల మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి..
* బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి నారాయణ హామీ
* నెల్లూరులో సముద్రపు ఈదురు గాలుల బీభత్సం.. ఇద్దరు మత్స్యకారులు దుర్మరణం
గరుడధాత్రి న్యూస్ :
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జరిగిన పడవ ప్రమాదంపై రాష్ట్ర మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోగోలు మండలం తాటిచెట్లపాలెం తీరంలో బోటు బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటనపై ఆయన వెంటనే స్పందించారు. ప్రమాద వివరాలను స్థానిక కావలి ఎమ్మెల్యే కృష్ణా రెడ్డితో పాటు, సంబంధిత అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి ఆరా తీశారు.సముద్రంలో వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తూపిలి బాల మురళి, కుమారి గోవిందు కుటుంబాలకు మంత్రి నారాయణ తన తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఈ కష్టసమయంలో ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.