మదనపల్లె సభకు తరలిన కుప్పం టిడిపి నేతలు, రైతులు
కుప్పం, అక్టోబర్ 02 (గరుడ ధాత్రి న్యూస్): మదనపల్లి లో శుక్రవారం జరిగిన హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వాహనాల్లో రైతులు, నాయకులు తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయమే ప్రత్యేక వాహనాల్లో రైతులు ప్రజాప్రతినిధులు తరలి వెళ్లారు. కుప్పం రూరల్, అర్బన్, గుడిపల్లి,శాంతిపురం, రామకుప్పం మండలాల నుండి రైతులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలి వెళ్లారు. ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పిఎంకె ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, కుప్పం...