GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 5:26 pm Digital Edition : GURU SWAMY

మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఏఐ స్మార్ట్ సిస్టమ్స్’పై వర్క్‌షాప్

పలమనేరు, అక్టోబర్10, గరుడ ధాత్రి :

మదర్ థెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (ఏఐ & డిఎస్) విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 5 నుంచి 9 వరకు “నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఫర్ ఏఐ డ్రైవన్ స్మార్ట్ సిస్టమ్స్” అనే అంశంపై ఐదు రోజుల వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మరియు స్మార్ట్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఆధారిత స్మార్ట్ అప్లికేషన్లు, డేటా విశ్లేషణ, ఇంటెలిజెంట్ డెసిషన్ సిస్టమ్స్, ఆటోమేషన్ ద్వారా వాస్తవ ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ఎలా కనుగొనవచ్చో వివరించారు. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్లుగా జి. పవన్ కళ్యాణ్, శ్యామ్ సుందర్, బీరే గౌడ వ్యవహరించి, పరిశ్రమల్లో వస్తున్న నూతన సాంకేతిక పరిణామాలు, పరిశోధనా అవకాశాలపై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ డా. ఎమ్. రవీంద్ర బాబు, చైర్మన్ సునీల్, డా. ఆర్. రాజేంద్ర రెడ్డి, డా. ఎమ్. లక్ష్మీ కాంత రెడ్డిల ప్రోత్సాహంతో, ఏఐ & డిఎస్ విభాగాధిపతి డా. కె. లోకేష్ ఆధ్వర్యంలో అధ్యాపక బృందం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసింది. విద్యార్థులు ఇలాంటి శిక్షణలను సద్వినియోగం చేసుకొని పరిశోధన, నూతన ఆవిష్కరణల దిశగా ఎదగాలని కళాశాల యాజమాన్యం ఆకాంక్షించారు.