ఎస్వీయూ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
పలమనేరు, సెప్టెంబర్ 04 ( గరుడ ధాత్రి ) : ఆగస్టులో విడుదలైన ఎస్.వి. యూనివర్సిటీ డిగ్రీ తృతీయ సెమిస్టర్ ఫలితాల్లో మదర్ థెరిసా డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలోనే టాపర్లుగా నిలిచారు. ఈ పరీక్షల్లో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించి కళాశాల కీర్తిని పెంచారు. వివిధ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు బీసిఏ (ఏ ఐ) ఎన్. సుహిత శ్రీ (9.17), ఎస్.డి. భవిత (9.07), ఆర్. మేఘన (9.00), టి. నసీరా భాను (9.00), బి.ఎస్సి :ఎ. నందిని (9.13), వి. చందన (8.65) బీసిఏ: ఎన్. శ్రావణి (8.90), బి. నందిని (8.84), బిబిఏ : బి.ఎం. జ్ఞాన ప్రసన్న (8.72), ఎస్. సారా ఫాతిమా (8.72), బి.కాం : త్రిష (8.62). కళాశాలలో బిబిఏ, బీసీఏ, బి.ఎస్సి, బి.కాం రెండవ సంవత్సరం, మూడవ సెమిస్టర్ ఫలితాల్లో కళాశాల నుండి ఏకంగా 240 మంది డిస్టింక్షన్‌లో, 125 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్ మధుసూధన రావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థిని విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన అధ్యాపక బృందాన్ని కళాశాల కరస్పాండెంట్ రవీంద్ర బాబు, చైర్మన్ సునీల్, మరియు అడ్వైజర్ రాజేంద్ర రెడ్డి తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.