పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) :
ఎస్.వి. యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన డిగ్రీ మూడవ సంవత్సరం, ఐదవ సెమిస్టర్ ఫలితాలలో స్థానిక మదర్ థెరిసా డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ప్రభంజనం సృష్టించారు. వివిధ విభాగాల్లో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఎస్జిపిఏ సాధించి విద్యాసంస్థ కీర్తిని దశదిశలా చాటారు. బి.కాం నందు చందన (9.07 ఎస్జిపిఏ) తో ప్రథమ స్థానంలో నిలవగా, అభిషేక్ (8.93), లోకేష్ (8.86) తర్వాతి స్థానాలు కైవసం చేసుకున్నారు.
బి.సి.ఏ నందు చందన (8.95 ఎస్జిపిఏ), సంధ్య (8.88), మేఘన (8.82), హేమలత (8.78), రుచిత (8.77) అత్యుత్తమ మార్కులతో టాప్ ర్యాంకులు సాధించారు. బి.బి.ఏ నందు పూజ (8.94 ఎస్జిపిఏ ) ప్రతిభ చాటగా, డింపుల్ (8.76), డి. లోచన రెడ్డి (8.75) ఉత్తమ ఫలితాలు సాధించారు. బి.ఎస్సీ నందు యాస్మిన్ (8.39 ఎస్జిపిఏ ) సాధించి కళాశాల స్థాయిలో టాపర్‌గా నిలిచింది. ఈ ఘన విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ రావు మాట్లాడుతూ… బి.సి.ఏ., బి.బి.ఏ., బి.కాం, బి.ఎస్సీ మూడవ సంవత్సరం ఐదవ సెమిస్టరు ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు ఏకంగా 300 మంది డిస్టింక్షన్ సాధించారని, 130 మంది ప్రథమ శ్రేణి (ఫస్ట్ క్లాస్) నందు ఉత్తీర్ణులయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, అధ్యాపకుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. కళాశాల స్థాయిలో ఘన విజయం సాధించి సంస్థకు మంచి పేరు తెచ్చిన విద్యార్థినీ విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని కళాశాల కరెస్పాండెంట్ డా. ఎమ్. రవీంద్ర బాబు, ఛైర్మన్ ఎమ్. సునీల్, మరియు అడ్వైజర్ డా. శ్రీ రాజేంద్ర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో వీరంతా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.