మదర్ థెరిసా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం ఐదో సెమిస్టర్ ఫలితాల్లో టాపర్ల ఘన విజయం

పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) : ఎస్.వి. యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన డిగ్రీ మూడవ సంవత్సరం, ఐదవ సెమిస్టర్ ఫలితాలలో స్థానిక మదర్ థెరిసా డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ప్రభంజనం సృష్టించారు. వివిధ విభాగాల్లో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఎస్జిపిఏ సాధించి విద్యాసంస్థ కీర్తిని దశదిశలా చాటారు. బి.కాం నందు చందన (9.07 ఎస్జిపిఏ) తో ప్రథమ స్థానంలో నిలవగా, అభిషేక్ (8.93), లోకేష్ (8.86) తర్వాతి స్థానాలు కైవసం చేసుకున్నారు. బి.సి.ఏ నందు...