మన్నారుపోలూరు ప్రభుత్వ పాఠశాలకు రూ.42 లక్షలతో మౌళిక వసతుల కల్పన
- శ్రీసిటీ ఐసాన్ పరిశ్రమ చేయూత సత్యవేడు, ఆగస్టు 06 గరుడధాత్రి : శ్రీసిటీ ఫౌండేషన్ సహకారంతో శ్రీసిటీకి చెందిన ఐసాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తమ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టిన మౌళిక వసతుల అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించింది. సుమారు రూ.42 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం, తరగతి గదుల మరమ్మతులు, ఆర్వో తాగునీటి ప్లాంట్, సేఫ్టీ గ్రిల్స్, ఫర్నిచర్...