GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 9:05 pm Posted by : GURU SWAMY

మర్రిమానుచేను గ్రామంలో ఘనంగా శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ -మహాకుంభాభిషేక వేడుకలు

బైరెడ్డిపల్లి, జూన్ 24 గరుడధాత్రి న్యూస్ : బైరెడ్డిపల్లి మండలంలోని మర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతి పూజ, వేదపారాయణం, గోపూజ, యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, వివిధ హోమాలు, పంచామృతాభిషేకం, అమ్మవారి అలంకరణ, విశేష అర్చనలు, శాంతి కల్యాణం, మహాకుంభాభిషేకం తదితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ గౌడు, పలమనేరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు భువన చంద్ర గౌడు పాల్గొన్నారు. వారికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మొగసాల కృష్ణమూర్తి, మొగసాల రెడ్డెప్ప కూడా కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారిని కూడా నిర్వాహకులు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.