మర్రిమానుచేను గ్రామంలో ఘనంగా శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ -మహాకుంభాభిషేక వేడుకలు

బైరెడ్డిపల్లి, జూన్ 24 గరుడధాత్రి న్యూస్ : బైరెడ్డిపల్లి మండలంలోని మర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, వేదపారాయణం, గోపూజ, యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, వివిధ హోమాలు, పంచామృతాభిషేకం, అమ్మవారి అలంకరణ, విశేష అర్చనలు, శాంతి కల్యాణం, మహాకుంభాభిషేకం తదితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ గౌడు, పలమనేరు...