GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 8:05 am Digital Edition : GURU SWAMY

మలగుంట అంగన్‌వాడీ కేంద్రంలో “పోషణ మాసం” కార్యక్రమం

పిచ్చాటూరు, అక్టోబర్ 8 గరుడధాత్రి :

పిచ్చాటూరు మండలంలోని మలగుంట అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తల్లి–శిశు ఆరోగ్యం, పోషకాహారం, పిల్లల సమగ్ర ఎదుగుదలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో FAC CDPO శ్రీమతి రాజేశ్వరి, ICDS సూపర్‌వైజర్లు కల్పలత, సుమతి, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంద్రాణి, శాంతి, చంద్రకళ, పాఠశాల ఉపాధ్యాయురాలు కవిత పాల్గొన్నారు. విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్స్ సహకారంతో జె. రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోషకాహారం, సమతుల్య ఆహారం, తల్లి–శిశు ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ IVR కాల్స్‌కు స్పందించడం, వాటి ద్వారా అందే సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అర్హులైన గర్భిణీలు, బాలింతలు ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకాన్ని వినియోగించుకోవాలని వివరించారు. అలాగే మిషన్ వాత్సల్య ద్వారా పిల్లల సంరక్షణ, రక్షణ, భద్రతకు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార, ఆరోగ్య సేవలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించడం, తల్లి–శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పిల్లల సమగ్ర అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.