మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
పిచ్చాటూరు, జూన్ 2 గరుడధాత్రి : జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మలేరియా నివారణపై అవగాహన కల్పిస్తూ "దోమ కాటును అరికట్టండి – మలేరియాను నిర్మూలించండి", "ప్రతి రాత్రి దోమతెర వాడండి – మలేరియాను దూరం పెట్టండి", "పరిసరాల పరిశుభ్రత – ఆరోగ్యకర జీవితం", "నీరు నిల్వ లేకపోతే – దోమల...