GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:57 am Digital Edition : GURU SWAMY

మళ్లీ కుప్పం నుంచే పోటీ చేస్తా

* కుప్పం టిడిపి క్యాడర్ సమావేశంలో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
* ఫుల్ జోష్ లో కుప్పం టిడిపి యంత్రాంగం.
* సమన్వయంతో లక్ష్యసాధనకు ఉపక్రమించండి.
కుప్పం,సెప్టెంబర్ 23 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభ్యునిగా మళ్లీ తానే పోటీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 21,22 తేదీలలో కుప్పం లో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో పై మేరకు ప్రకటించారు. ఇప్పటివరకు కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఎనిమిది సార్లు విజయం సాధించానని, తొమ్మిదవ సారి సైతం తానే పోటీ చేయనున్నానని ప్రకటించారు. దీంతో కుప్పం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ఆనందం,హర్షం వ్యక్తం చేసింది. మున్ముందు జరగనున్న స్థానిక ఎన్నికల్లో సమన్వయంతో లక్ష్యాల సాధనకు పార్టీ యంత్రాంగం ఉపక్రమించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను ఎక్కడున్నా తన మూడో నేత్రం కుప్పం పైనే ఉంటుందని అది పార్టీ నేతలు, నాయకులు గుర్తుంచుకోవాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయం పక్కాగా ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తానని పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పార్టీ యంత్రాంగానికి తేల్చి చెప్పారు. దీంతో కుప్పం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ యంత్రాంగం కేరింతలు కొడుతూ , ఫుల్ జోష్ తో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తానని ప్రకటించి స్థానిక పార్టీ యంత్రాంగాన్ని స్థానిక ఎన్నికలకు సిద్ధం చేయడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో కనివిని ఎదగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నామని చంద్రబాబు వివరించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంచుకొని ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు.