**ఉదయం 7 గంటలకే ఒంటరి ఏనుగు పొలాల వద్ద ప్రత్యక్ష్యం
*పొలాలు వద్ద పోవాలంటే భయం
బైరెడ్డిపల్లి, గరుడదాత్రి సెప్టెంబర్19
బైరెడ్డిపల్లి మండల పరిధిలోని కడపనత్తం గ్రామ అటవీ సరిహద్దు సమీపంలోని
లేట్ ఆనందశెట్టి కుమారుడు గజేంద్ర రైతుకు చెందిన 1 ఎకరా బొప్పాయి పంటను ఒంటరి ఏనుగు శుక్రవారం రాత్రి ధ్వంసం చేసినది. ఇదే రైతుకు చెందిన బొప్పాయి తోటను మళ్ళీ బుధవారం రాత్రి కూడా పంటను నాశనం నాశనం చేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరి ఏనుగు ఉదయం 7 గంటల ప్రాంతంలో పంట పొలాల వద్ద సంచరిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. దీంతో ఉదయం పంట పొలాల వద్దకు వెళ్లే రైతులకు ప్రాణ భయం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. తక్షణం దీన్ని కట్టడి చేయాలని రైతులు తెలియజేస్తున్నారు. గతంలో ఇదే అటవీ సరిహద్దు ప్రాంతంలో ఒంటరి ఏనుగు, ఏనుగుల గుంపు వరి పైరు పై సంచరించి 4 ఎకరాల పంట నష్టాన్ని చేయడం జరిగినది. సంబంధిత అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు కోరుతున్నారు. గతంలో శాసనసభ సమావేశంలో పలమనేరు ఎం.ఎల్.ఏ. అమరనాథరెడ్డి ఏనుగులవల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చక్కగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.నేడు పంటలు పై కన్నా ప్రాణభయం వెంటాడుతున్న నేపథ్యంలో ఎం.ఎల్.ఏ. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతుల చెందుతున్న ఈ ఏనుగుల సమస్య పరిష్కారంకు కృషిచేసి రైతులకు ప్రాణారక్షణ కల్ల్పించాల్సిన అవసరం ఉంది.