GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 12:43 pm Digital Edition : GURU SWAMY

మహాత్మా గాంధీ చూపిన బాటలో నడుద్దాం

* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
* జాతిపిత మహాత్మా గాంధీ కి,లాల్ బహుదూర్ శాస్త్రి కి ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): సత్యం అహింస స్వచ్ఛత గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మనకు మార్గదర్శకమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు మహాత్మా గాంధీ కి నివాళులర్పించారు. అలాగే లాల్ బహుదూర్ శాస్త్రి కి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం వారు చేసిన త్యాగాలు ప్రజలను ఏకం చేసి నడిపించిన తీరు చిరస్మరణీయమన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన స్వాలంబనతో కూడిన పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పని చేద్దామని పిలుపునిచ్చారు భారత దేశ నిర్మాణంలో భాగంగా వికసిత భారత్ కోసం గాంధీజీ చూపిన బాటలో నడుద్దాం అని పిలుపునిచ్చారు. లాల్ బహుదూర్ శాస్త్రి నిరాడంబరతకు ప్రతిరూపమని కొనియాడారు. దేశభక్తి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అన్నారు.