GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 7:12 pm Posted by : GARUDA DHATRI NEWS

మహానాడు లో పాల్గొన్న బల్లి కళ్యాణ్ చక్రవర్తి

గరుడధాత్రి న్యూస్ :
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బి.కొత్తకోట మండలం నందు తెలుగుజాతి పండుగ మహానాడు 2026 రెండవ రోజు ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎమ్మెల్సీ మరియు మహానాడు పరిశీలకుడు బల్లి కల్యాణ్ చక్రవర్తి.
రెండవ రోజు మహానాడు 2026లో భాగంగా ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరిస్తూ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ఎమ్మెల్సీ మరియు మహానాడు పరిశీలకుడు.
బి.కొత్తకోట మండలంలో మాజీ ఎమ్మెల్యే గుళ్లొల్ల శంకర్ యాదవ్ గారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్,తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు,అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు,నాయకులు,కార్యకర్తలు సమక్షంలో భారీ కేక్ కటింగ్ అనంతరం తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని 10 క్లస్టర్లు నందు మహానాడు 2026 ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ఎమ్మెల్సీ మరియు మహానాడు పరిశీలకుడు బల్లి కల్యాణ్ చక్రవర్తి,
మహిళల ప్రగతికి టీడీపీ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని,డ్వాక్రా సంఘాల ద్వారా మహిళకు ఆర్థిక శక్తినిచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది,స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో రాజకీయంగా బలోపేతం చేశారని, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారి ఆధునిక సాంకేతికత,విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో అవకాశాలు కల్పిస్తూనే, పార్టీ పదవుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ప్రకటించి వారి రాజకీయ ప్రస్థానానికి మరియు మహిళ ‘స్త్రీ శక్తికి’ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకడం గొప్ప వరమని తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలో అన్ని క్లస్టర్లు నుండి మహానాడు 2026 కార్యక్రమంలో పాల్గొన్న మహిళామణులతో రాష్ట్ర ఎమ్మెల్సీ,మహానాడు పరిశీలకుడు బల్లి కల్యాణ్ చక్రవర్తి గారు మరియు అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు చర్చించారు.
తెలుగుదేశం పార్టీకి అధినేత కార్యకర్తే,మన అడుగుజాడలే పార్టీకి దిశానిర్దేశం చేస్తాయి.ఒక్కో కార్యకర్త ఒక్కో సైనికుడై పసుపు జెండాను రెపరెపలాడిద్దాం..’ఇది నా తెలుగుదేశం,నా బాధ్యత చాటి చెపుద్దామని పిలుపునిచ్చిన రాష్ట్ర ఎమ్మెల్సీ మరియు మహానాడు పరిశీలకుడు బల్లి కల్యాణ్ చక్రవర్తి
అలాగే స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరల ద్వారా మహానాడు 2026లో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ప్రసంగాల ప్రత్యక్ష ప్రసారాలను పార్టీ నాయకులు,క్లస్టర్లు ఇంచార్జీలు,కార్యకర్తలు,అభిమానులతో కలిసి ప్రత్యేకంగా వీక్షించిన రాష్ట్ర ఎమ్మెల్సీ మరియు మహానాడు పరిశీలకుడు…*
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుళ్లొల్ల శంకర్ యాదవ్ గారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు, అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు, స్థానిక నాయకులు,క్లస్టర్లు ఇంచార్జీలు,కార్యకర్తలు,అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.