GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 10:03 pm Posted by : GARUDA DHATRI NEWS

మహానాడు సందర్భంగా నీరువాయిలో అల్పాహార విందు ఏర్పాటు

పిచ్చాటూరు మే 28 గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో తెలుగు వారి ఆత్మీయ పండుగగా భావించే మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే ఈ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే
కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అరుల్ ప్రకాష్, ఆయన తనయుడు యువజన నాయకుడు జార్జ్ విజయ్ గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు గురువారం ఉదయం అల్పాహార విందును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తెలుగుజాతి ముద్దుబిడ్డ, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.