మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు డిజిటల్ మహిళా సంఘం వేదిక

తిరుపతి, మే 7 : మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు డిజిటల్ మహిళా సంఘం వేదిక కాబోతోందని టిడిపి నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో డి ఎం ఎస్ ధన్విత సూపర్ బజార్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్యాంకు శాంతమ్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, భవిష్యత్తులో మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా...