మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించిన శ్రీ సిటీ పోలీసులు

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మోపురుపల్లి గ్రామంలోని బ్లూ స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శ్రీ సిటీ పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. “మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళా ఉద్యోగుల్లో చైతన్యాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బీవీ శ్రీనివాసులు, శ్రీ సిటీ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి ఎం. ప్రియాంక పాల్గొని మహిళల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో తీసుకోవాల్సిన...