మహిళా సాధికారతకు అడుగుజాడ గురజాడ:హెచ్.ఎం రవి

కార్వేటి నగరం సెప్టెంబర్ 21 (గరుడ దాద్రి న్యూస్): మహిళా సాధికారతకు, సమాజ వికాసానికి ఆధునిక యుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అడుగుజాడలు నిజమైన మార్గదర్శకాలని డీ.ఎం.పురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి పేర్కొన్నారు. స్థానిక డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ త్యాగరాజు ఆధ్వర్యంలో, హెచ్.ఎం రవి అధ్యక్షతన గురజాడ అప్పారావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, సమాజంలో మహిళల హక్కులు,...