మహిళా సాధికారత మరియు బాలల సంక్షేమంపై అవగాహన కార్యక్రమం

పలమనేరు, సెప్టెంబర్ 03 ( గరుడ ధాత్రి ) : స్థానిక ఎస్‌వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా మహిళా సాధికారత సెల్ (ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్) ఆధ్వర్యంలో మహిళా సాధికారత, మహిళలు మరియు బాలల రక్షణ, హక్కులు, సైబర్ నేరాలపై మరియు వివాహపూర్వ కౌన్సెలింగ్ (ప్రేమరిటల్ కౌన్సిలింగ్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా . ఎం. వెంకటేశులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ నిర్మల, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ చందు రాణి, చైల్డ్...