మాకు ఒక అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం

నాగలాపురం 3వ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల మద్దతు కోరిన మోహనంబాల్, శ్రీనివాస యాదవ్ నాగలాపురం, నవంబర్ 2 గరుడధాత్రి : ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగలాపురం మండలం 3వ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థులు మోహనంబాల్, శ్రీనివాస యాదవ్ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమకు ఒక్క అవకాశం కల్పిస్తే సెగ్మెంట్‌ను అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామని ఓటర్లను అభ్యర్థించారు. నాగలాపురంలోని ఈశంగాడు, పదమర దళితవాడ, నటరాజుగుంట తదితర గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. తమను...