GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 7:04 pm Digital Edition : GURU SWAMY

మాజీ సర్పంచ్ ఎం ఆర్ వెంకటరెడ్డి చేసిన సేవలు మరువలేనివి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కార్వేటినగరం అక్టోబర్ 4 గరుడదాద్రి న్యూస్ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు ఎంఆర్ వెంకటరెడ్డి చేసిన సేవలు మరువలేవని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ రాజేష్ అన్నారు. కార్వేటినగరం మండలం ఆర్కే విబిపేట పంచాయతీ చెందిన మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి అతని కర్మ క్రియలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్వేటినగరం మండలానికి చేసిన అభివృద్ధి మరువలేని తెలిపారు. అదేవిధంగా ఆ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటుకు మరియు గ్రామ అభివృద్ధికి ఎంతో సేవ చేశారన్నారు ఇతని సేవలు మరో లేవన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యురాలు దేవకి లోకనాథ్ రెడ్డి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ బాధ్యులు మరియు మాల కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు యుగంధర్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ వైయస్సార్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.