మాట నిలబెట్టుకున్నాం.. 11 ఏళ్ల షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం

*– రూ.22 కోట్ల వేతన బకాయిల విడుదలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హర్షం కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తీరని లోటుగా ఉన్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల వేతన బకాయిల సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం లభించింది. దాదాపు 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.22 కోట్ల వేతన బకాయిలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడంపై కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులోని వీపీఆర్...