మానవ–ఏనుగు సంఘర్షణ నివారణపై రైతులకు ప్రాయోగిక శిక్షణ
పలమనేరు, ఆగస్టు 19 గరుడధాత్రి : పలమనేరు రేంజ్ పరిధిలోని అటవీ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న రైతులకు, మానవ-ఏనుగు సంఘర్షణల నివారణపై ఈ రోజు ఒక ప్రత్యేక ప్రాయోగిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. స్థానికంగా, తక్కువ ఖర్చుతో లభించే సాంకేతిక వనరులను ఉపయోగించి ఏనుగుల దాడుల నుండి ప్రాణ, పంట నష్టాలను ఎలా అరికట్టవచ్చో ఈ కార్యక్రమంలో సవివరంగా వివరించారు. బెంగళూరు నుండి విచ్చేసిన నిపుణులు రుద్రాదిత్య ఉదయం మరియు సాయంత్రం వేళల్లో రైతులకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష శిక్షణ అందించారు. ఏనుగుల సంచారం...