మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -రైతు సంఘం నాయకుడు ఉమాపతి నాయుడు

పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) : మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వారిని ఆదుకున్న రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఉమాపతి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, నష్టాలను వివరించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు....