GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 5:57 am Digital Edition : GURU SWAMY

మిట్టపల్లి లో వైభవంగా గంగజాతర వేడుకలు.

-గంగజాతర లో పాల్గొన్న మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు.

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్10

బైరెడ్డిపల్లి మండలం లోని మిట్టపల్లి లో మంగళవారం వైభవంగా గంగజాతర నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డిపల్లి లోని శ్రీ భాటగంగమ్మ అమ్మవారి ఆలయం కు మిట్టపల్లి మహిళలు సామూహికంగా దీపాలు మూసుకొని తరలివచ్చి పూజలు జరిపారు. అనంతరం మిట్టపల్లి లో అమ్మవారి శిరస్సు ను సుందరంగా అలంకరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మంగళహారతులు పట్టి మొక్కుబడులు చెలించుకొన్నారు.ఈ గంగజాతర లో బైరెడ్డిపల్లి మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు తన అనుచరులతో పాటు పాల్గొనగా నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి సత్కరించి ప్రసాదాలు అందజేశారు. గ్రామంలో,భాటగంగమ్మ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ అలంకరణలు ప్రజలను ఆకట్టుకొన్నది.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.