కీలక ముందడుగన్న ఎన్ టి ఎ నాయకులు
పలమనేరు, ఆగష్టు 21( గరుడ ధాత్రి ) :
మినిమం టైం స్కేల్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ ఐదుగురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు సమిష్టిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలిసి ప్రాతినిధ్యం చేశారని జిల్లా అధ్యక్షకార్యదర్శులు డాక్టర్ జయప్రకాశ్,రామయ్య లు తెలిపారు.శుక్రవారం సాయంత్రం వీరు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, ఈ అంశానికి సంబంధించిన ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి అంగీకరించడం ఎం టి ఎస్ ఉపాధ్యాయులకు ఎంతో ఆశాజనకమైన పరిణామమన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, సొసైటీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు
ఏపీ మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.అదే విధంగా విద్యా వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులకు కూడా 62 ఏళ్ల పదవీ విరమణ వయస్సు అమలయ్యే దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం శుభపరిణామమని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ తరపున తెలిపారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి , ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి సమిష్టిగా తీసుకెళ్లిన ఐదుగురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయుల తరఫున నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదములు అందించారు.
–