మీసేవ కేంద్రాల్లో అధిక ఛార్జీలుకు అడ్డుకట్ట వేయాలిని ఆర్డీవోకు పిపిఎస్ వినతిపత్రం
*పలమనేరు, సెప్టెంబర్ 21 ( గరుడ ధాత్రి ) : పట్టణంలోని మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని 'పలమనేరు పరిరక్షణ సమితి' (పిపిఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పలమనేరు ఆర్డీవో భవాని కు సమితి ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మీసేవ నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో...