ముంబైలో పవన్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ముంబై వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. కుడి భుజానికి తీవ్రమైన శస్త్రచికిత్స చేయించుకుని ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ఆసుపత్రిలో కోలుకుంటున్న పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు స్వయంగా కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో సినిమా షూటింగుల సమయంలో పవన్ కల్యాణ్ భుజానికి తీవ్రమైన గాయాలయ్యాయి. చాలా కాలంగా ఈ పాత గాయాల నొప్పితో ఆయన బాధపడుతున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సైతం కూటమి విజయం కోసం ఈ తీవ్రమైన భుజం నొప్పిని...