GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 10:02 am Digital Edition : GURU SWAMY

ముఖ్యమంత్రి కార్యక్రమానికి టీడీపీ నేతల భారీ తరలింపు

నేడు తిరుపతిలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి పిచ్చాటూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ డి. ఇలంగోవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా బయలుదేరారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపు మేరకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.