GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 6:32 am Posted by : GARUDA DHATRI NEWS

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రులు, కార్యక్రమాల కోఆర్డినేటర్ తో కలిసి ముందస్తు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్…

పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి టౌన్, జూన్ 11, మనం న్యూస్ : తిరుపతి జిల్లా దామినేడు లో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
గురువారం మధ్యాహ్నం హోం మంత్రి అనిత, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు అనగానీ సత్యప్రసాద్, రాష్ట్ర ముఖ్య మంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్ రావు, శాప్ చైర్మన్ రవి నాయుడు, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి తో కలిసి పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనెల 12 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి విధులు కేటాయించిన అధికారులు తమ విధులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలలో భద్రత ఏర్పాట్లు ను పకడ్బందీగా చేయాలని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, హెలిపాడ్ వద్ద బారికేడ్ ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.