ముడియూరు 165వ పోలింగ్ బూత్‌ను పరిశీలించిన తహసీల్దార్ బృందం
పిచ్చాటూరు ఆగస్టు 21 గరుడధాత్రి: పిచ్చాటూరు మండలం ముడియూరు గ్రామపంచాయతీ పరిధిలోని 165 (PS)వ పోలింగ్ బూత్‌ను తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పోలింగ్ బూత్‌లో అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలించి, ఓటర్ల వివరాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓటర్ల జాబితాలోని వివరాలు, పోలింగ్ కేంద్రంలో ఉన్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సంబంధిత సిబ్బందికి తహసీల్దార్ పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను...