GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 11:14 am Digital Edition : GURU SWAMY

మున్సిపల్ పోరులో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్

* అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యం.
* ప్రజాస్వామ్యంలో ఓటు
వజ్రాయుధం.
* ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్.
చిత్తూరు బ్యూరో, నవంబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కుప్పం మున్సిపాలిటీకి ఆదివారం పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా 26వ వార్డులో ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుప్పం అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే ఆకాంక్షతో కుప్పం మున్సిపాలిటీ 26వ వార్డులో నా ఓటు హక్కును వినియోగించుకున్నానన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. రాజ్యాంగం మనకు కల్పించిన ఈ అమూల్యమైన హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలి. ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి అన్నారు.